మంత్రి హరీష్ రావు ఇలాకాలో కలెక్టరేట్ భవనం ఎక్కి రైతుల నిరసన

by Sathputhe Rajesh |
మంత్రి హరీష్ రావు ఇలాకాలో కలెక్టరేట్ భవనం ఎక్కి రైతుల నిరసన
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : కలెక్టరేట్ నిర్మాణం కోసం.. భూములు కోల్పోయిన రైతులు పూర్తిస్థాయి పరిహారం కోసం కలెక్టరేట్ భవనం ఎక్కి నిరసన తెలిపారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... సిద్దిపేట కలెక్టరేట్ నిర్మాణం కోసం దుద్దెడ, రాంపల్లి శివారులోని సర్వేనెంబర్ 663, 143 రైతుల నుండి భూమిని ప్రభుత్వం సేకరించింది. రైతులకు అప్పటి కలెక్టర్ వెంకట్రాంరెడ్డి భూమి కోల్పోయిన వారి కుటుంబానికి ఉద్యోగం, 200 గజాల ప్లాటు, బోరుబావులకు పండ్ల తోటలకు నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చారన్నారు.

ఈ విషయమై పలుమార్లు అధికారులకు విన్నవించిన పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. దీంతో విసుగు చెందిన రైతులు సోమవారం ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడానికి ప్రయత్నించారు. ప్రజావాణి జరుగుతున్న హాల్లోకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ మేరకు అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోవడంతో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ భూమిని కోల్పోయిన రైతులు కలెక్టరేట్ భవనం ఎక్కి నిరసన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed