Smita Sabharwal: స్మితా సబర్వాల్‌ వివాదంపై ప్రొఫెసర్ కోదండరామ్ రియాక్షన్

by Ramesh N |
Smita Sabharwal: స్మితా సబర్వాల్‌ వివాదంపై ప్రొఫెసర్ కోదండరామ్ రియాక్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్మితా సబర్వాల్ ఐఏఎస్ అధికారి దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీజేఎస్ చీఫ్ కోదండరామ్ అన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. దివ్యాంగులు కొన్ని పోస్టులకు పనికిరారు అనేది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమన్నారు.ఇలాంటి వ్యాఖ్యలను నాగరిక సమాజం ఖండించాలని, ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు రాకుండా జాగ్రత్త పడాలని సూచనలు చేశారు. మరోవైపు వారి వ్యాఖ్యలను ఉపసంహరంచుకోక పోగా.. దాన్ని సమర్ధించుకునే ప్రయత్నం చేయడం.. చాలా షోచనీయమైన విషయం అన్నారు. 2016 లో వికలాంగుల హక్కుల చట్టం ఒకటి తయారు అయ్యిందన్నారు. ఆ హక్కుల చట్టం ప్రకారం.. వైకల్యం కలిగిన ప్రతి ఒక్కరికి కూడా అందరితో పాటు సమానంగా ఎదగడానికి అవకాశాలు కల్పించాలి. వారు ఆత్మగౌరవంతో జీవించే పరిస్థితులు ప్రభుత్వం కల్పించాలి. వైకల్యం పేరుతో వారి హక్కులను హరించడానికి వీలు లేదన్నారు.

ఆర్టికల్ 7 ప్రకారం వారిని దూషించిన, వారిపై దాడులకు దిగిన, హింసించిన అవి కూడా పెద్ద నేరాలుగా పరిగణించి వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు. ఇటువంటి చట్టాన్ని అమలు చేయాల్సిన టువంటి స్థానంలో ఉన్న ఒక అధికారి వారి వైకల్యం కారణంగా ఎత్తిపొడుస్తూ.. కించపరుస్తూ.. వారిపై నీచంగా వ్యాఖ్యానించడం సమంజసం కాదన్నారు. వారు పనికి రారు అని ఒక మాట వారు వ్యాఖ్యానించారని, వాస్తవానికి చాలా మంది వైకల్యం కలిగిన వారు.. చాలా మంచిగా జీవితంలో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని చెప్పారు. దేశ కీర్తి ప్రతిష్టలను కూడా ప్రపంచానికి చాటి చెప్పారని గుర్తు చేశారు. చట్టాన్ని అమలు చేయాల్సిన టువంటి స్థానంలో ఉన్న ఒక అధికారి ఈ రకంగా మాట్లాడాన్ని తప్పుబడుతున్నాని వెల్లడించారు.

Advertisement

Next Story