రైతులు ఆవేదనలో ఉంటే సచివాలయం సంబురాలు అవసరమా?

by GSrikanth |
రైతులు ఆవేదనలో ఉంటే సచివాలయం సంబురాలు అవసరమా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఒక పక్క అకాల వర్షాలతో పంట నష్టపోయి రైతులు ఆవేదనతో ఉంటే నూతన సెక్రటేరియట్ ఇంత అట్టహాసంగా సంబురాలు జరపడం దురదృష్టకరమని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ‘దిశ’ మీడియాతో మాట్లాడారు. రైతులు అకాల వర్షాలతో పంట నష్టపోయి బాధపడుతున్నారని అన్నారు. పంటనష్టంతో రైతుల చేతిలో పైసలు లేవని, మరొక పంట వేయడానికి పెట్టుబడి కూడా లేదన్నారు. పంటనష్టం వల్ల మాకు చావు తప్ప ఇంకో మార్గం లేదని రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారని వెల్లడించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ట పెంచుకోవడం కోసమే మాత్రమే కోట్ల ఖర్చుతో నూతన సచివాలయం నిర్మాణం, సచివాలయ సంబరాలు అని అన్నారు. నూతన సచివాలయ నిర్మాణం రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదన్నారు. సచివాలయం సంబరాలపై కాకుండా రాష్ట్రంలోని స్కూల్ లపై హాస్టలపై ఖాళీగా ఉన్న పోస్టులపై యూనివర్సిటీలపై దృష్టి పెట్టాలని ఉపాధి కల్పన మీద దృష్టి పెట్టాలి.. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన ప్రాధాన్యత మర్చిపోయి కేవలం పాలకులు తమ ప్రతిష్ట కోసం నూతన సచివాలయ సంబరాలు చేస్తున్నారు.

Advertisement

Next Story