- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సామాన్యుడిలా ప్రవర్తిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రొఫెసర్ కోదండరామ్ హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: నామినేటెడ్ పోస్టుల విషయంలో మా పార్టీకి కూడా కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని టీజేఎస్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తరువాత గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తాము తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశామని గుర్తుచేశారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది.. కానీ ఆ విషయాన్ని గులాబీ నాయకులు గుర్తించడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజా తీర్పును బీఆర్ఎస్ గౌరవించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన కొనసాగదు.. కూలిపోతుంది అని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు.
విభజన హామీలు అమలు చేయాలి.. కృష్ణానది జలాల పంపిణీలో రాష్ట్రానికి న్యాయమైన వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. కాజీపేటలో కోచ్ వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరారు. భద్రాచలంలో రాముడి గుడికి రక్షణ లేదు చెప్పారు. భద్రాచలాన్ని రక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కానీ వాళ్ళు ఆ పని చేయలేదని విమర్శించారు. ప్రగతి భవన్ ముందు ఉన్న గేట్లు బద్దలు కొట్టినప్పుడు సంతోషం కలిగింది.. సీఎం రేవంత్ ప్రవర్తన సామాన్య జనాలకు నచ్చుతుందని అభిప్రాయపడ్డారు. నెల రోజుల కాంగ్రెస్ పాలన బాగుందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మార్పు వచ్చినట్టు ఢిల్లీ పాలనలో కుడా మార్పు రావాలని కోరుకున్నారు.