- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఘటనకు కారకులు ఎవరో బయటపెట్టాలి: ప్రొ. కోదండరాం డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం అయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే తామే ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టమని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం హడావుడిగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టిందని అన్నారు.
ఈ నిర్మాణంలో ప్రభుత్వం పూర్తిగా నాణ్యత ప్రమాణాలను విస్మరించిందని చెప్పారు. బ్రిడ్జి ఖంగుదలకు కారణాలు, కారకులు ఎవరో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈపీసీకి సంబంధం లేదని, అధికారుల బాధ్యత ఉందన్నారు. కేవలం కాంట్రాక్టు సంస్థ ద్వారా కమిషన్ డబ్బులు దండుకునేందుకు నిర్మాణం చేపట్టారని ఆయన ఆరోపించారు. దీర్ఘకాలిక ప్రయోజనానాలను దృష్టిలో ఉంచుకొని నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆయన డిమాండ్ చేశారు.