- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ములుగు సభలో మహిళా డిక్లరేషన్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఎన్నికల్లో గెలుపుపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రచార పర్వాన్ని స్పీడప్ చేసింది. ఇప్పటికే ఆరు గ్యారెంటీలను ప్రకటించిన హస్తం పార్టీ.. వివిధ వర్గాలను ఆకర్షించేందుకు ప్రత్యేక డిక్లరేషన్లు ప్రకటిస్తూ వస్తోంది. ఎస్సీ ఎస్టీ, నిరుద్యోగ డిక్లరేషన్లు ఇప్పటికే ప్రకటించగా ఈరోజు మహిళా డిక్లరేషన్ ప్రకటించబోతున్నది. ములుగు జిల్లా రామానుజపురం లో ఇవాళ సాయంత్రం జరగబోయే బహిరంగ సభలో పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ మహిళా డిక్లరేషన్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మహిళా డిక్లరేషన్ పై ఆసక్తి ఏర్పడింది. మరో వైపు పార్టీ ఇచ్చిన హామీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు పక్కాగా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రాష్ట్రంలో తొలి విడత బస్సు యాత్ర ప్రారంభించబోతున్నారు.