- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రైవేట్ కంపెనీ బాగోతం.. ఖాళీ జాగా కనిపిస్తే పాగా!
దిశ, రంగారెడ్డి బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములను పరిరక్షించాలి... ప్రజా అవసరాల కోసం వినియోగించాలని ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేస్తోంది. ఈ సూచనలు కేవలం మాటలకే పరిమితమైతున్నట్లు జిల్లాలోని జరిగే భూ వ్యవహారంతో స్పష్టం అవుతోంది. రియల్ వ్యాపారులు అధికార పార్టీ నేతలతో కుమ్మక్కై ప్రభుత్వ భూముల పక్కనే వెంచర్లు చేస్తూ కబ్జాలకు పాల్పడుతున్నారు.
జిల్లాలోని షాద్నగర్ నియోజకవర్గంలోని కొత్తూర్, నందిగామ, ఫారూక్నగర్ మండలాల పరిధిలో పెద్ద ఎత్తున్న పరిశ్రమలు నెలకొల్పుతున్నారు. ఈ పరిశ్రమలు ఏర్పాటు చేసే యాజమాన్యులు స్ధానికంగా ఉండే బలమైన నేతలతో కుమ్మక్కై ప్రభుత్వ భూములపై కన్నేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే జిల్లాలోని కొత్తూరు మండల ఖాజీగూడ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నెంబర్6లో 4 ఎకరాలు కబ్జాకు గురైనట్టు తెలుస్తోంది.
దర్జాగా ప్రైవేట్ కంపెనీ కబ్జా...
జిల్లాలో ఖాళీ స్థలం కనిపిస్తే పాపమై పోతోంది. ఆ ఖాళీ స్థలం పక్కనున్న పట్టా భూములను లీగల్గా కొనుగోలు చేశామని చెప్పుకుంటూ ప్రభుత్వా భూములను కబ్జా చేస్తున్నారు. స్ధానిక రెవెన్యూ అధికారులకు విషయం తెలిసినప్పటికి, ఫిర్యాదు చేయకపోతే తమకేంటి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆ భూములను సర్వే చేసి హద్దులు పెడితే ప్రజలే ఆ భూములను కాపాడుకుంటారు.
కానీ కొంత మంది రెవెన్యూ అధికారులు విషయం తెలిసినప్పటికి కబ్జాదారుడితో బేరం కుదుర్చుకొని జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఖాజీగూడ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 6లో 13.31 ఎకరాల భూమి ఉంటే అందులో 4 ఎకరాలు కబ్జాకు గురైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. స్ధానికంగా ఉండే ఆర్ఐ, వీఆర్వో, తహాశీల్ధార్‌కు సమాచారం ఇవ్వడం లేదా? ఇచ్చినా పట్టించుకోవడం లేదా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
కోట్ల విలువైన భూమికి ఎసరు...
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం కేంద్రంలోని ఓ గ్రామంలో సర్వే నెంబర్ 6లో 13.31 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కొత్తూరు పారిశ్రామిక వాడ కావడంతో భూములకు మంచి ధరలు కూడా ఉన్నాయి. నేషనల్ హైవేకు దగ్గరగా ఉండడంతో కొందరు ప్రైవేటు వ్యక్తులకు ఆ భూమిపై కన్ను పడింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం భూమి ఉండగా దానిని కబ్జా చేసి దర్జాగా ఓ ప్రైవేటు కంపెనీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
సుమారు ఎకరాకు రూ. కోటి యాభై లక్షల వరకు ధర పలుకుతుంది. ప్రభుత్వ పొలాలు నాటి కాలంలో ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని లక్ష్యంతో ప్రభుత్వం వ్యవసాయ భూములను పేదలకు ఇచ్చింది దానిని అమ్ముకునే హక్కు లేదు. అలాంటి భూమిని కంపెనీ యాజమాన్యం ఆక్రమించి నిర్మాణాలు యదేచ్ఛగా చేపడుతోంది. మరి చిన్నచిన్న రైతులను ఇబ్బంది పెట్టే అధికారులు యాజమాన్యానికి వత్తాసు పలకడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొత్తూరు మండల కేంద్రంలోని రెండు గ్రామాల మధ్యలో సుమారు 13 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది నాటి నుండి రైతులు దానిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రైవేట్ కంపెనీ సుమారు 14 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపడుతున్నారు. పట్టా భూమికి అసైన్ భూమి కలుస్తుండడంతో పక్కనే ఉన్న అసైన్ ల్యాండ్ పైన సదరు యజమాని కన్నేసి పొలంలో నిర్మాణ పనులు చేస్తున్నారు. ప్రభుత్వ వ్యవసాయ భూమి నాలుగు ఎకరాలు పట్టా భూమికి కలుపుకొని ఎవరికి అనుమానం రాకుండా పొలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాడు.
నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూమిలో అధికారుల అనుమతులు లేకుండా ఇలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనేది నిబంధన ఉన్నది. నిబంధనలకు విరుద్ధంగా కంపెనీ నిర్మించడం వెనుక మరి రాజకీయ నాయకుల హస్తం ఉందా లేదా అధికారుల హస్తం ఉందా అనేది అంతుచికడం లేదు. కోట్ల విలువ చేసే భూమిని ఆక్రమించడం పట్ల అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.