- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం పథకాలలో వారికి ప్రాధాన్యత.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session) కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సభలో బీసీ రిజర్వేషన్ల పెంపు (BC Reservations Bill), ఎస్సీ వర్గీకరణ (SC Classification Bill) సహా పలు బిల్లులు ఆమోదం పొందాయి. ఈ నేపథ్యంలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లుపై సభలోని సభ్యులు మట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodar Rajanarsimha) మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణలో భాగంగా మాదిగల రిజర్వేషన్ కోసం పోరాడుతూ చాలా మంది మాదిగలు అమరులయ్యారని, దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. అంతేగాక మాదిగ రిజర్వేషన్ కోసం అమరులైన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంటుందని అన్నారు.
దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Reavnth Reddy) మాట్లాడుతూ.. మాదిగల రిజర్వేషన్ కోసం గత ముప్పై ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. ఈ పోరాటంలో చాలా మంది అమరులు అయ్యారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాలను, మాదిగ ఉపకులాల వర్గీకరణ పోరాటంలో అమరులైన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో (Indiramma Illu Scheme) అమరులైన వారి కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని హామీ ఇచ్చారు. అంతేగాక త్వరలో అమలు చేయబోయే రాజీవ్ యువ వికాసం పథకంలో (Rajiv Yuva Vikasam Scheme) కూడా అమరులైన వారి కుటుంబంలో చదువుకున్న వారు ఉంటే వారికి ప్రాధాన్యత ఇచ్చి, ఈ ఫథకం కింద నాలుగు లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అసెంబ్లీ వేదికగా సీఎం భరోసా ఇచ్చారు.