ప్రధాని మోడీ తెలంగాణ టూర్ యధాతథం

by Mahesh |
ప్రధాని మోడీ తెలంగాణ టూర్ యధాతథం
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్టు చేసినంతమాత్రాన భయపడబోమని, ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 8న నగరంలో పర్యటించే షెడ్యూల్ యధాతథంగా ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో భాగంగా ప్రధాని వస్తున్నందున దానికి ఎలాంటి ఆటంకాలు ఉండవన్నారు. బండి సంజయ్‌ను అరెస్టు చేసినంతమాత్రాన కార్యక్రమాన్ని వాయిదా వేసుకునే ఉద్దేశమే లేదని, ప్రధాని తన షెడ్యూలు ప్రకారం వస్తున్నారని, అన్ని ప్రోగ్రామ్‌లూ కొనసాగుతాయన్నారు.

బండి సంజయ్‌ను అరెస్టు చేసిన తీరు అప్రజాస్వామికమని, అర్ధరాత్రి ఇంటి నుంచి తీసుకెళ్ళడమే కాక గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కనీసం మాత్రలు వేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదని తప్పుపట్టారు. ఈ పరిణామాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని హైదరాబాద్‌లో బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Next Story