BREAKING: జహీరాబాద్ సాక్షిగా మాదిగలకు ప్రధాని మోడీ కీలక హామీ

by Satheesh |
BREAKING: జహీరాబాద్ సాక్షిగా మాదిగలకు ప్రధాని మోడీ కీలక హామీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఎస్సీ వర్గీకరణపై మరోసారి ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తెలంగాణలో పర్యటిస్తోన్న మోడీ.. జహీరాబాద్ లోక్ సభ సెగ్మెంట్ పరిధిలో బీజేపీ అల్లాదుర్గం వద్ద ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు. కానీ ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని అన్నారు. మాదిగలకు మాత్రం తప్పకుండా న్యాయం చేస్తామని జహీరాబాద్ సాక్షిగా మోడీ మాటిచ్చారు.

2024లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌కి రికార్డ్ స్థాయిలో ఎంపీ స్థానాలొచ్చాయని.. అయిన కూడా ఆ పార్టీ దళితులు, ఓబీసీలకు అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లింగాయత్ రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకమని.. కానీ ముస్లిం రిజర్వేషన్లకు మాత్రం ఆ పార్టీ అనుకూలమని మండిపడ్డారు. బంజారా రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మోసం చేశాయన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి రాజ్యాంగానికి వ్యతిరేకమని ఫైర్ అయ్యారు. మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరగాంధీ రాజ్యాంగాన్ని పదే పదే అవమానించారని మోడీ కాంగ్రెస్‌పై మోడీ నిప్పులు చెరిగారు.

Advertisement

Next Story