PM Modi: తెలంగాణకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో హార్ట్ స్టంట్ తయారీ పరిశ్రమ ప్రారంభించిన ప్రధాని మోడీ

by Prasad Jukanti |
PM Modi: తెలంగాణకు గుడ్ న్యూస్..  రాష్ట్రంలో హార్ట్ స్టంట్ తయారీ పరిశ్రమ ప్రారంభించిన ప్రధాని మోడీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా సుల్తాన్ పూర్ మెడికల్ డివైజ్ పార్క్ లో హార్ట్ స్టంట్లు తయారు చేసే పరిశ్రమను ప్రధాని నరేంద్ర మోడీ (Pm Modi) వర్చువల్ గా ప్రారంభించారు. ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో హార్ట్ స్టంట్ల తయారీ పరిశ్రమ (Heart Stunt Manufacturing Industry) ను ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, హార్ట్ స్టంట్ కంపెనీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. మెడికల్ డివైజ్ పార్కుకు మరిన్ని పరిశ్రమలు రావాలని, మెడికల్ డివైజ్ ఎక్విప్ మెంట్ లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉండాలని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) ఆకాంక్షించారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందని అన్నారు.

పెద్దలకు రూ. 5 లక్షల ఆరోగ్య బీమా షురూ:

దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పై బడిన వారందరికీ రూ.5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా (Health Insurence) సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య పరికరాలు, బల్క్ డ్రగ్స్‌ ఉత్పత్తి చేసే కంపెనీలకు సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం(పీఎల్ఐ)ను అమలు చేస్తోంది. ఈ స్కీం కింద ఐదు ప్రాజెక్టులకు ప్రధాని మోడీ పచ్చజెండా ఊపారు. దేశంలోని గర్భిణులు, 16 ఏళ్లలోపు బాలలకు 12 వ్యాక్సిన్లను అందించే సమాచారాన్ని ఎప్పటికప్పుడు డిజిటలైజ్ చేసే ప్రత్యేక ‘యూ-విన్’ (U-WIN) పోర్టల్‌ను మోడీ ప్రారంభించారు.

Advertisement

Next Story