GHMC : అవగాహనతోనే వ్యాధుల నివారణ సాధ్యం! జీహెచ్ఎంసీ ఆసక్తికర ట్వీట్

by Ramesh N |
GHMC : అవగాహనతోనే వ్యాధుల నివారణ సాధ్యం! జీహెచ్ఎంసీ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో రాష్ట్ర సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఇవాళ ఆసక్తికర ట్వీట్ చేసింది. అవగాహనతోనే వ్యాధుల నివారణ సాధ్యమని జీహెచ్ఎంసీ పోస్ట్ షేర్ చేసింది. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధులపై ఐఈసీ కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించింది.

ఈ మేరకు ప్రతి శుక్రవారం ఇంటింటికీ తిరుగుతూ సీజనల్ వ్యాధులపై ప్రచారం చేస్తున్నట్లు వెల్లడించింది. స్కూళ్లు, కాలేజీల్లో ప్రతి శనివారం విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపింది. 3045 స్కూళ్లు, 427 కాలేజీల్లో సీజనల్ వ్యాధులపై అవగాహన జీహెచ్ఎంసీ సిబ్బంది పూర్తి చేసినట్లు పేర్కొంది. దోమల వృద్ధి, వ్యాప్తిపై 2751 విద్యార్థి వాలంటీర్లకు శిక్షణ ఇచ్చినట్లు ఫోటో షేర్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed