మేడమ్ సార్ మేడమ్ అంతే.. బీచ్‌లో బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న అలనాటి స్టార్ హీరోయిన్.. (ఫొటోలు)

by Kavitha |
మేడమ్ సార్ మేడమ్ అంతే.. బీచ్‌లో బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న అలనాటి స్టార్ హీరోయిన్.. (ఫొటోలు)
X

దిశ, సినిమా: సీనియర్ స్టార్ హీరోయిన్ లయ గురించి తెలుగు ఆడియెన్స్‌కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ బ్యూటీ. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత పిల్లలు.. అలా సినిమాలకు కొంత గ్యాప్ తీసుకున్న ఈ భామ.. రీ ఎంట్రీకి రెడీ అయిపోయింది. అందులో భాగంగా నితిన్ హీరోగా నటిస్తోన్న ‘రాబిన్ హుడ్’ మూవీలో ఈ ముద్దుగుమ్మ ఓ కీలక పాత్ర పోషించనుందని సమాచారం.

ఇదిలా ఉంటే.. తాజాగా లయ తన పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఇక ఈ పార్టీ అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా బీచ్‌ సెలబ్రేషన్స్‌ ఫొటోలు షేర్ చేసిన లయ తన స్నేహితురాలు అపూర్వ స్వీట్‌ సర్‌ ప్రైజ్ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం లయ పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు చాలా ‘మేడమ్ సార్ మేడమ్’ అంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

(content link credits to laya instagram id)

Advertisement

Next Story

Most Viewed