Typhoon Trami: తుపాను బీభత్సం.. 23 మంది మృతి

by Rani Yarlagadda |
Typhoon Trami: తుపాను బీభత్సం.. 23 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: తుపాను కారణంగా కొండచరియలు విరిగిపడి 23 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన ఈశాన్య ఫిలిప్పీన్స్ లో జరిగింది. అక్కడ సంభవించిన తుపాను బీభత్సం సృష్టించింది. కార్లు, సామాన్యు కొట్టుకుపోగా.. ప్రజలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. కొంతమంది ఇళ్లు మునిగిపోవడంతో పై కప్పులపై సహాయం కోసం నిరీక్షిస్తోన్న ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అత్యవసర సేవలకు కావలసిన ప్రభుత్వ కార్యాలయాలు మినహా.. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించి.. వాటినే పునరావాస కేంద్రాలుగా మార్చారు అధికారులు. ఇఫుగావో పర్వత ప్రావిన్స్ లోని అగ్వినాల్డో పట్టణంపై తెల్లవారుజామున 95 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులు ప్రజలు భయాందోళనలకు గురిచేసింది. ట్రామి (Cyclone Trami)గా పిలవబడుతోన్న తుపాన్ సాయంత్రం దక్షిణ చైనాలోకి ప్రవేశిస్తుందని అక్కడి వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

ట్రామి ప్రభావంతో కురిసిన భారీవర్షాలకు వరదలు సంభవించాయి. క్యూజోన్ ప్రావిన్స్ వరదనీటిలో మునిగిపోయింది. కొండచరియలు విరిగిపడటం, రోడ్లపై చెట్లు నేలకూలడంతో వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. మనీలాకు ఆగ్నేయంగా ఉన్న ఆరు-ప్రావిన్స్ బికోల్ ప్రాంతంలో అత్యధికంగా 20 మంది మరణించారు. నాగా నగరంలో 7 మంది నివాసితులున్నారు. రానున్న 24 గంటల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుందన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. 1500 మంది పోలీసులు సహాయకచర్యల్లో పాల్గొన్నారు. తుఫాను కారణంగా 2 మిలియన్లకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారని ప్రభుత్వ విపత్తు-ఉపశమన సంస్థ తెలిపింది. వీరిలో 75,400 మంది గ్రామస్తులు తమ ఇళ్లను వదిలి సురక్షితమైన మైదానంలో ఆశ్రయం పొందుతున్నారు.

ఆల్బే ప్రావిన్స్‌లో దేశంలోని 24 క్రియాశీల అగ్నిపర్వతాలలో ఒకటైన మయోన్ నుండి బురద ప్రవాహాలు అనేక వాహనాలను చుట్టుముట్టాయని డిజోన్ చెప్పారు. వాహనాలు సగానికి పైగా బురదలో కూరుకుపోయిన ఫొటోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed