- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Traffic Alert: వాహనదారులకు బిగ్ అలర్ట్.. వారం పాటు ఆ ఫ్లైఓవర్ మూసివేత..!
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) కీలక సూచన చేశారు. ఈ మేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించనున్నట్లుగా పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ (GHMC) ఎస్ఆర్డీపీ (SRDP) అభివృద్ధి పనుల్లో భాగంగా శిల్పా లేఅవుట్ (Shilpa Layout) ఫేజ్-2 పరిధిలో నూతనంగా ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఆ పనులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి ఫ్లై ఓవర్ (Gachibowli Fly over)ను వారం రోజుల పాటు క్లోజ్ చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) వెల్లడించారు.
ఈ మేరకు మంగళవారం నుంచి ఈ నెల 28 రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవీస్ (Cyberabad Traffic Joint CP Joel Davies) తెలిపారు. అయితే, ఆ రూట్లో వెళ్లే వాహనదారులు ప్రత్నామ్నాయం చూసుకోవాలని సూచించారు. కాగా, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో శిల్పా లేఅవుట్లోని ఫేజ్-2 ప్రాంతంలో గత కొన్ని రోజుల నుంచి ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.