- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సల్మాన్ ఖాన్ బెదిరింపుల కేసు.. కూరగాయల వ్యాపారి అరెస్ట్
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)కు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) నుంచి ఇటీవల కాలంలో వరుస బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల జరిగిన బిగ్ బాస్ షో షూటింగ్ కు కూడా సల్మాన్ ఖాన్ భారీ భద్రత నడుమ హాజరయ్యారు. రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. వచ్చిన సందేశంపై పోలీసులు దర్యాప్తు చేయగా.. అది కూరగాయల వ్యాపారి చేసిన పని అని నిర్థారించారు. ఝార్ఖండ్ లోని జంషెడ్ పూర్ కు చెందిన 24 ఏళ్ల కూరగాయల వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కష్టపడకుండా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న అత్యాశతో అతను ఈ పనికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.
"సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలని, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ శతృత్వాన్ని ఆపాలన్నా.. సల్మాన్ రూ.5 కోట్లు చెల్లించాలి. లేదంటే.. సిద్ధిఖీకి పట్టిన గతే అతనికీ పడుతుంది. ఈ బెదిరింపుల్ని లైట్ తీసుకోవద్దు " అని పేర్కొంటూ.. ఇటీవల ముంబై పోలీసులకు మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత తాను కావాలని బెదిరింపులకు పాల్పడలేదని, అనుకోకుండా అలా జరిగింది.. క్షమించాలని మరో మెసేజ్ లో కోరాడు. దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు.. ఝార్ఖండ్ పోలీసుల సహాయంతో జంషెడ్ పూర్ కు చెందిన కూరగాయల వ్యాపారిని అరెస్ట్ చేశారు.