KTR: మాజీ మంత్రి కేటీఆర్‌కు ఊహించని షాక్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుకు ఫిర్యాదు

by Shiva |   ( Updated:2024-10-24 04:07:48.0  )
KTR: మాజీ మంత్రి కేటీఆర్‌కు ఊహించని షాక్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుకు ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: ట్యాంక్‌బండ్‌ (Tankbund) వద్ద అంబేద్కర్ విగ్రహం (Ambedkar statue) చుట్టూ కట్టిన గోడను బీఆర్‌ఎస్‌ నాయకులు (BRS Leaders) ఉద్దేశపూర్వకంగా కూల్చేశారని ఇటీవలే కాంగ్రెస్ నేతలు (Congress Leaders) అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్‌ (Additional DGP Mahesh Bhagawath)ను కలిసి ఫిర్యాదు చేశారు. అందుకు ప్రధాన కారణం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే (BRS Working President KTR) కారణమని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రశాంతంగా రాష్ట్రంలో విద్వేషాలను రెచ్చగొట్టి శాంతి‌భద్రతలకు భంగం వాటిల్లేలా కేటీఆర్ (KTR) వ్యవహరించారని ఫైర్ అయ్యారు. ఇలాంటి ఘటనలు దేశ సమగ్రతను దెబ్బతీస్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే, రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా మాజీ మంత్రి కేటీఆర్‌ (Former Minister KTR)పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, ఆ పార్టీ ముఖ్య నేత మన్నె క్రిశాంక్ (Krishank), కేటీఆర్ పీఏ తిరుపతి (PA Tirumathi), బీఆర్‌ఎస్‌ సోషల్ మీడియా వింగ్‌ (BRS Social Media Wing)పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు (SC, ST Atrocity Case) నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రీతం (SC Cell President Preetham) ఆధ్వర్యంలో తెలంగాణ ఖనిజ వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఇరవర్తి అనిల్ (Iravarthy Anil), ముత్స్య కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి (Mettu Sai) అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్‌ (Additional DGP Mahesh Bhagawath)ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు కేటీఆర్‌ (KTR)పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తారా.. లేదా అన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed