- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TPCC చీఫ్ ఎంపిక వాయిదా..! రేవంత్ స్థానాన్ని భర్తీ చేసేదెవరని తీవ్ర ఉత్కంఠ
దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ ఎంపికపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పదవి కాలం ముగియనుండటంతో ఆయన స్థానంలో మరొకరిని భర్తీ చేయడంపై ఏఐసీసీ కసరత్తు మొదలు పెట్టింది. పీసీసీ అధ్యక్షుడి ఎన్నికకు ఇప్పటికే ఢిల్లీ వేదికగా పలు దఫాలుగా చర్చ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల నుండి ఏఐసీసీ అభిప్రాయాలను స్వీకరించింది. టీపీసీసీ పంపిన అభ్యర్థుల జాబితాను ఫిల్టర్ చేసి అందులో ఒకరి పేరును ఏఐసీసీ ఫైనల్ చేస్తోందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి పేరును ఇప్పటికే ఏఐసీసీ కన్ఫామ్ చేసిందని.. ఇక అధికారిక ప్రకటనే తరువాయి అని గత వారం రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఆశావాహులు సైతం గత 10 రోజుల నుండి హస్తినాలోనే మకాం వేసి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. దీంతో త్వరలోనే హైకమాండ్ పీసీసీ నూతన అధ్యక్షుడి పేరును లాంఛనంగా ప్రకటిస్తుందని వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. టీపీసీసీ చీఫ్ ఎన్నిక ప్రక్రియను ఏఐసీసీ తాత్కాలికంగా వాయిదా వేసింది. పీసీసీ చీఫ్ పదవి కోసం ఆశావహుల నుండి తీవ్ర పోటీ ఉండటంతో టీపీసీసీ అధ్యక్షుడి ఎన్నిక ఏఐసీసీకి కత్తి మీద సవాల్‌గా మారింది. కాగా, పీసీపీ అధ్యక్షుడి ఎంపికపై తుది చర్చలు జరిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ అయ్యి స్టేట్ చీఫ్ ఎన్నికపై చర్చించారు.
ఈ భేటీలోనూ పీసీసీ చీఫ్ ఎన్నిక విషయంలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికను ఏఐసీసీ తాత్కాలికంగా వాయిదా వేసింది. ఈ అంశంపై వారం పదిరోజుల్లో మరోసారి చర్చించాలని ఏఐసీసీ డిసైడ్ అయ్యింది. కాంగ్రెస్ అగ్రనేతలు మరోసారి చర్చించాకే పీసీసీ అధ్యక్షుడి పేరును ప్రకటించే ఛాన్స్ ఉంది. ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో పూర్తిస్థాయిలో చర్చించకుండా తొందరపడి పేరు ప్రకటిస్తే అసంతృప్తి రాజుకునే అవకాశం ఉందని గ్రహించిన ఏఐసీసీ.. వారం రోజుల గ్యాప్ తర్వాత పీసీసీ ఎంపికపై మరోసారి దీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ ఎంపిక మరోసారి వాయిదా పడటంతో ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో రేవంత్ స్థానాన్ని భర్తీ చేసే క్యాండిడేట్ ఎవరనే దానిపై స్టేట్ పాలిటిక్స్‌లోనూ ఆసక్తి నెలకొంది.