- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకప్ అయి విడాకులు తీసుకోకపోతే నా లైఫ్ మరో సావిత్రి అయ్యేది.. సమంత కామెంట్స్ చైని ఉద్దేశించేనా?
దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకొని విడిపోయిన విషయం తెలిసిందే.డివోర్స్ తర్వాత సామ్ మానసికంగా చాలా కుంగిపోయింది. అంతే కాకుండా, మయోసైటీస్ అనే వ్యాధిబారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన హెల్త్‌పై ఆమె ఫోకస్ చేసింది. మానసిక ప్రశాంతత కోసం వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ, ధ్యానం చేస్తూ వచ్చింది.అయితే స్టార్ బ్యూటీ సమంత తన జీవితం కూడా మరో సావిత్రిలా అయ్యేదని, కానీ తృటిలో తప్పించుకున్నాను అంటూ ఓ సందర్భంలో చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. సావిత్రి జెమినిగణేషన్‌ను వివాహం చేసుకొని, ఆయన వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకోవడంతో అధి భరించలేక ఆమె వ్యసనాలకు బానిసై, ఆస్తిని పొగొట్టుకొని, కోమాలోకి వెళ్లి, జీవచ్ఛవంలా మారి డిసెంబర్ 26న కన్నుమూశారు. దీంతో ఓ అద్భుతమైన ఓ నటిని తెలుగు చిత్రపరిశ్రమ కోల్పోయింది. తెలుగు సినీ చరిత్రలోనే ఓ శకం ముగిసిపోయినట్లు అయ్యింది.
అయితే టాలీవుడ్ హీరోయిన్ సమంత, తన లైఫ్ కూడా మరో సావిత్రిలా అయ్యేదని తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. తకు సావిత్రి గురించి అంతగా తెలియదు అని, కానీ మహానటి సినిమా, ఆమె సినిమాలు చూశాక తన గురించి తెలుసుకున్నాను. అప్పుడు నాకు అనిపించింది. నా జీవితం కూడా అలాగే అయ్యేదని, సావిత్రి గారిలానే నేను కూడా ప్రేమ విషయంలో ఒకసారి మోసపోయాను కానీ అదృష్టం కొద్ది అందులో నుంచి బయటపడగలిగాను. లేకపోతే నా లైఫ్ కూడా అలానే అయ్యేదంటూ ఒప్పుడు సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే దీంతో ఈ కామెంట్స్ విన్న కొందరు సామ్ సిద్ధార్థ్ ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసిందంటే, చైతుని ఉద్దేశించి కావచ్చు, ప్రేమించి పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంది కదా అందుకే ఆ కామెంట్స్ చేసిందని మరికొందరు అంటున్నారు.