Breaking: నిమ్స్‌లో విషాదం.. అనస్తీషియా ప్రొఫెసర్ ఆత్మహత్య

by srinivas |   ( Updated:2024-07-06 06:20:16.0  )
Breaking: నిమ్స్‌లో విషాదం.. అనస్తీషియా ప్రొఫెసర్ ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: నిమ్స్‌ ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. అనస్తీషియా అడిషనల్ ప్రొఫెసర్ పాచీకర్ ఆత్మహత్య చేసుకున్నారు. బేగంపేటలోని తమ నివాసంలో అనస్తీషియా మందు మోతాదుకు మించి అధికంగా తీసుకున్నారు. దీంతో ఆమె అపస్మారణ స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పాచీకర్ శనివారం ఉదయం మృతి చెందారు. పాచీకర్ మృతిపై పోలీసులకు కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనతో నిమ్స్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed