- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ponnam Prabhakar:‘ఆటోల బంద్ వాయిదా వేయండి’.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్: ఆటో కార్మికులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి(Transport and BC Welfare Minister) పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) హామీ ఇచ్చారు. నేడు(మంగళవారం) హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను తెలంగాణ ఆటో &ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ యూనియన్ ఐక్య కార్యాచరణ సమితి నేతలు కలిశారు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన ఆటో డ్రైవర్లు ఇచ్చిన సమ్మె పిలుపుపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. తమ ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. సమస్యలు పరిష్కారించాలని ఆటో యూనియన్ నేతలు వినతిపత్రం అందజేయగా ఆయన మాట్లాడారు. ఈ నెల 6న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ కోదండరాం, రవాణా శాఖ సిబ్బందితో ఈ విషయమై చర్చిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో బంద్‌ను వాయిదా వేయాలని మంత్రి పొన్నం కోరారు.