Bhatti : మాట ఇచ్చాం - మాఫీ చేశాం.. రుణమాఫీపై ఎక్స్‌లో డిప్యూటీ సీఎం

by Ramesh N |
Bhatti : మాట ఇచ్చాం - మాఫీ చేశాం.. రుణమాఫీపై ఎక్స్‌లో డిప్యూటీ సీఎం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆగస్టు 15 వ తేదీన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఫైనల్ ఫేజ్ రుణమాఫీ నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ముందు ప్రకటించిన విధంగానే కాంగ్రెస్‌ సర్కార్‌ రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేసి హామీని నిలబెట్టుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కోటి నెరవేర్చుకుంటూ రేవంత్ సర్కార్ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రూ.2 లక్షలలోపు రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఆగస్టు 15 లోపు అర్హులైన రైతులకు రుణమాఫీ చేసే ప్రక్రియ పూర్తి చేస్తామని గతంలో ప్రకటించిన ప్రభుత్వం మూడు దశల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసింది.

ఈ క్రమంలోనే గత అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘మాట ఇచ్చాం - మాఫీ చేశాం, కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనం అని రుణమాఫీ అమలతో మరోసారి రుజువైంది. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలు చేశామని.. గతంలో శాసనసభలో మాట్లాడిన వీడియో విడుదల చేశారు.

Advertisement

Next Story