హైడ్రా ఆపరేషన్‌పై ప్రజలు నుంచి పాజిటివ్ రెస్పాన్స్.. ఇదే ఊపులో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |
హైడ్రా ఆపరేషన్‌పై ప్రజలు నుంచి పాజిటివ్ రెస్పాన్స్.. ఇదే ఊపులో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైడ్రా ఆపరేషన్‌పై ప్రజలు నుంచి అనూహ్య పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో, చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. చెరువులు, కుంటలకు సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతిపాదనలకు సర్కార్ అంగీకారం చెప్పింది. చెరువులు, కుంటల పరిధిలోని ఎఫ్టీ ఎల్(పుల్ ట్యాంక్ లెవల్), బఫర్ జోన్లలోని అక్రమ కట్టడాలను, నిర్మాణాలను కూల్చుతూనే ఇక నుంచి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూత్రపాయ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తొలుత గ్రేటర్ హైదరాబాద్ పరిధి, ఆ తర్వాత హెచ్ ఎండీఏ పరిధిలో ఈ బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. పర్యావరణ పరిరక్షణలో ఈ బోర్డులు కీలకంగా మారతాయని అధికారులు చెప్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు తొమ్మిది వందలకు పైగా చెరువులు(చిన్నవి,పెద్దవి కలిపి) ఉండగా, వీటిలో 30 శాతం చెరువులు పూర్తిగా మాయం కాగా, మరో ఇరవై శాతం చెరువులు అక్రమ కట్టడాలు, నిర్మాణాలు వెలిసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. గతంలో ఏర్పాటు చేసిన సైన్ బోర్డులు కానరాకుండా చేసి కబ్జాలు పెట్టారు. దీంతో కొత్తగా మరో సారి ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది. హైడ్రా ఆపరేషన్ తర్వాత చెరువుల పరిస్థితి, విస్తీర్ణంపై స్పష్టమైన రూపు రేఖలు రానున్నాయని, ఆ తర్వాత సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్ఎంసీకి చెందిన ఓ అధికారి ఒకరు స్పష్టం చేశారు.

లేక్ పరిరక్షణ కమిటీలు..?

హైడ్రా ఆపరేషన్ తొలుత హెచ్ఎండీఏ పరిధిలో సంపూర్ణంగా నిర్వహిస్తామని, ఆ తర్వాతనే జిల్లాలకు అంటూ తాజాగా సీఎం రేవంత్ రె డ్డి వ్యాఖ్యానించారు. అయితే హైడ్రా ఆపరేష న్ తర్వాత చెరువులను రెగ్యులర్ గా మానిటరింగ్ చేసేందుకు ‘లేక్ పరిరక్షణ కమిటీ ’లు వేయనున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే ఎల్ పీసీలు పటిష్టంగా పనిచేసేందుకు సమర్ధవంతమైన ఆఫీసర్లను నియమించనున్నట్లు తెలి సింది. వాస్తవానికి హెచ్ఎండీఏ పరిధిలో 2010 నుంచి లేక్ పరిరక్షణ కమిటీ కొనసాగుతున్నది. కానీ ప్రభుత్వాల ప్రెజర్, నిధులు సమకూర్చకపోవడం, ఇతర రాజకీయ ఒత్తి ళ్లతో సమర్ధవంతంగా పనిచేయలేదనేది కాం గ్రెస్ ప్రభుత్వం భావన. దీంతో రేవంత్ రెడ్డి సర్కార్ లో సంపూర్ణంగా చెరువుల పరిరక్షణ కోసమే ఈ కమిటీలు పనిచేసేందుకు పటిష్టమైన టీమ్ లను రెడీ చేస్తున్నారు. హెచ్ఎమ్డీఏతో పాటు అన్ని జిల్లాల్లోనూ ఈ కమిటీలు రూపకల్పన కానున్నాయి. ఇందులో రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, ఎన్విరాన్ మెంట్ తదితర శాఖలకు చెందిన ఆఫీసర్లు ఉండనున్నారు. వీళ్లంతా సమన్వయంతో చెరువుల సంరక్షణకు కృషి చేయనున్నారు.

ప్రత్యేక నిధులు కూడా...

హైడ్రాతో భవిష్యత్ తరాలకు మేలు జరగాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నా రు. తమిళనాడు, కేరళ, హిమా చల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి పరిస్థితులు మన దగ్గర రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైడ్రా టార్గెట్ కూడా ఇదే అంటూ ఉన్నతాధికారులు చెప్తున్నా రు. అయితే లేక్ పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులను కూడా కేటాయించాలని భావిస్తున్నది. గత ప్రభుత్వాలు ఈ దిశగా కృషి చేయకపోవడంతోనే ప్రస్తుతం ఈ పరిస్థితిని ఎదుర్కొవాల్సి వస్తుందని సీఎం తన రివ్యూలలో వెల్లడిస్తున్నారు. దీంతో నిధులు కేటాయిం చి ఎల్ పీసీలు రెగ్యులర్ గా మానిటరింగ్ చేసేలా ఆదేశాలివ్వనున్నా రు. చెరువులు కబ్జా కాకుండా, ఆక్ర మణలకు గురికాకుండా నిత్యం ఫోకస్ పెట్టనున్నారు. ఇందుకు కావాల్సిన ముంద స్తు ప్రిపరేషన్లు అన్ని చేయనున్నారు. సరిహద్దుల ను, జోన్లను ఫిక్స్ చేసి నిత్యం దృష్టి కేంద్రీకరించనున్నారు. ప్రతి ఆరు నెలలకోసారి చెరువులు, కుంటల పరిస్థితులపై ప్రభుత్వానికీ రిపోర్టు అందజేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed