- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chicken breeding : పెరటి కోళ్ల పెంపకం..లాభదాయకం
దిశ, ఊట్కూర్ : కోళ్ల పెంపకంతో లాభాలు పొంది ఆర్థిక స్వాలంబన సాధించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా ఊట్కూర్ గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రూ.2 లక్షల పెట్టుబడితో ఏర్పాటు చేసిన పెరటి కోళ్ల పెంపకం మదర్ యూనిట్ ను సోమవారం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళ శక్తి కింద వివిధ వ్యాపారాలు చేసుకుని మహిళలు లాభాలు పొందాలని సూచించారు. పెరటి కోళ్ల పెంపకానికి ఎన్ని కోడిపిల్లలను తెచ్చారని,ఎన్ని వారాల పాటు వాటి పోషణ,సంరక్షణ చేస్తారని సమాఖ్య సభ్యులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మహిళా సంఘాల సభ్యులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఏ మొగులప్ప, అడిషనల్ డిఆర్డిఏ అంజయ్య, తహసిల్దార్ రవి, ఎంపీడీవో ధనుంజయ గౌడ్, మాజీ సర్పంచ్ సూర్య ప్రకాష్ రెడ్డి, నాయకులు యగ్నేశ్వర్ రెడ్డి, శంకర్ గ్రామైక్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.