- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విజయ్ తొలి పొలిటికల్ మీటింగ్ గ్రాండ్ సక్సెస్.. స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్
దిశ, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ హీరో విజయ్ Vijay(జోసెఫ్ విజయ్) ఇటీవల TVK తమిళ వెట్రి కజగం అనే పార్టీని పెట్టారు.ఈ క్రమంలో త్వరలో తమిళనాడు రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా చేసుకుని ఆదివారం.. TVK పార్టీ తొలి రాజకీయ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. కాగా ఈ సభకు దాదాపు 8 లక్షల మంది కార్యకర్తలు, అభిమానులు హాజరవ్వగా.. ఆ మీటింగ్ జన సముద్రాన్ని తలపించింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే సమావేశంలో విజయ్(Vijay) మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన సమయంలో తనపై చాలా విమర్శలు వెల్లువెత్తాయి, అలాంటి వాటిని నేను పట్టించుకోనని చెప్పుకొచ్చారు. అలాగే తమిళ(Tamil) రాజకీయాల్లో అభివృద్ది అవసరం అని, తాము ఎవరికి A టీమ్ B టీమ్ కాదని చెప్పుకొచ్చారు. స్టార్ హీరోగా ఎన్నో హిట్ సినిమాలను అందుకున్న విజయ్ తన తొలి సభతోనే తమిళ రాజకీయాలను మొత్తం తన వైపు తిప్పుకున్నాడు. కాగా ఆయన తొలి రాజకీయ సభపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan) ట్విట్టర్ వేదికగా స్పందించారు. సాదువులు, సిద్ధుల భూమి అయిన తమిళనాడులో రాజకీయ యాత్రను ప్రారంభించినందుకు నటుడు విజయ్ కి నా హృదయపూర్వక అభినందనలు అని తన ట్వీట్ లో పవన్ రాసుకొచ్చారు.