Revenue Department: తెలంగాణ రెవెన్యూ శాఖలో ప్రక్షాళన ప్రారంభం

by Gantepaka Srikanth |
Revenue Department: తెలంగాణ రెవెన్యూ శాఖలో ప్రక్షాళన ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రెవెన్యూ శాఖ(Revenue Department) ప్రక్షాళనకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) శ్రీకారం చుట్టారు. ఆయన పుట్టిన రోజునే ఏకంగా 70 మంది డిప్యూటీ కలెక్టర్లు(Deputy Collectors), స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేశారు. ఇటీవల రెవెన్యూ సంఘాలు పదోన్నతులు, బదిలీలపై మంత్రికి మొర పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే మంత్రి తన మార్క్ పాలనను షురూ చేశారు. ఒకే సారి ఇంత పెద్ద సంఖ్యలో బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. పలువురు అదనపు కలెక్టర్లు(Additional Collectors), ఆర్డీవో(RDOs)లు, భూ సేకరణ అధికారులు, సివిల్ సప్లయిస్ వంటి శాఖల్లో పని చేస్తున్న వారిని బదిలీ చేశారు. ఎవరూ ఊహించని రీతిలో స్థానాలకు వెళ్లారు. కొందరికేమో వాళ్లు కోరుకున్న సీట్లు రాలేదు. మరికొందరికేమో వారు ఆశించని విధంగా ప్రాధాన్యత కలిగిన డివిజన్లకు బదిలీ కావడం గమనార్హం.

వెయిటింగ్‌లోని పది మంది ఆర్డీవోలకు కూడా పోస్టింగ్స్ లభించాయి. ఐతే డిప్యూటీ కలెక్టర్లు ఎల్ రమేష్, ఎన్ ఆనంద్ కుమార్, వి.హనుమా నాయక్ లకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. వారిని రెవెన్యూ శాఖలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు సోమవారం రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. హైడ్రా విస్తరణ, కొత్త ఆర్వోఆర్ చట్టం, ధరణి స్థానంలో భూమాత, పెండింగ్ భూ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ స్థలాల రక్షణ వంటి అనేకాంశాల నేపధ్యంలో ఈ బదిలీలు జరిగినట్లు తెలిసింది. త్వరలో భూ పరిపాలనలో అనేక సంస్కరణలు రానున్నాయి. వీటన్నింటినీ సమర్ధవంతంగా అమలు చేయడానికి అవసరమైన ప్లాట్ ఫారాన్ని మంత్రి పొంగులేటి ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement

Next Story