TATA: క్విక్‌ కామర్స్‌ రంగంలోకి ఎంట్రీ ఇవ్వనున్న టాటా గ్రూప్..!

by Maddikunta Saikiran |
TATA: క్విక్‌ కామర్స్‌ రంగంలోకి ఎంట్రీ ఇవ్వనున్న టాటా గ్రూప్..!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం మన దేశంలో క్విక్ కామర్స్(Quick Commerce) బిజినెస్ రంగానికి కస్టమర్ల(Customers) నుంచి ఆదరణ భారీగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. క్విక్ కామర్స్ సంస్థలు ఆర్డర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ప్రొడక్ట్(Product) లను డెలివరీ చేస్తున్నాయి. ఆయిల్(Oil) నుంచి మొదలుకొని స్మార్ట్‌ఫోన్స్‌(Smartphones) వరకు క్విక్‌ కామర్స్‌లో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే బ్లింకిట్(Blinkit), స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌(Swiggy Instamart), జెప్టో(Zepto) వంటి సంస్థలు క్విక్‌ కామర్స్‌ సేవలందిస్తుండగా.. తాజాగా ఈ రంగంలోకి ప్రవేశించేందుకు టాటా(TATA) ప్లాన్‌ చేస్తోంది.

కాగా టాటా గ్రూప్‌ ఆధ్వర్యయంలోని బిగ్‌బాస్కెట్‌(BigBasket) ద్వారా ఈ-కామర్స్‌, క్రోమా(Chroma) ద్వారా ఎలక్ట్రానిక్స్‌, టాటా క్లిక్‌(Tata CLiQ) ద్వారా ఆన్‌లైన్‌ షాపింగ్‌ సేవలు, టాటా 1ఎంజీ(Tata 1mg) ద్వారా ఫార్మసీ సేవలు వినియోగదారులకు అందిస్తోంది. దీంతో వీటన్నింటినీ ఏకం చేస్తూ 'న్యూఫ్లాష్‌(Newflash)' పేరుతో ఈ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సేవలను ముందుగా దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో(Metro Cities) అందించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ రంగంలో కంపెనీకి కస్టమర్లు ఉండటంతో కొత్తగా ప్రారంభించే వ్యాపారానికి కూడా వీరి హెల్ప్ ఉంటుందని సంస్థ భావిస్తోంది.

Advertisement

Next Story