- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొంగులేటి సంచలన నిర్ణయం.. సీఎం కేసీఆర్‌కు షాక్ తప్పదా?
దిశ, డైనమిక్ బ్యూరో: త్వరలో తాను పాదయాత్ర చేయబోతున్నాని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై కార్యచరణ రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రైతు సమస్యలపై ఖమ్మంలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పంట నష్టంపై హామీ ఇచ్చి 50 రోజులు అవుతున్నా ఇప్పటివరకూ ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. తక్షణమే పంట నష్టం ఇస్తామంటే సీఎం కేసీఆర్ దృష్టిలో ఆరు నెలలా.. సంవత్సరమా అనేది చెప్పాలన్నారు. రూ. 10 వేలు కంటి తడుపుగా రైతులు ఇవ్వడం కాదని, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ. 30 వేలు ఇవ్వాలని పొంగులేటి డిమాండ్ చేశారు.
రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మొక్కుబడిగా కొనుకేంద్రాలు ప్రారంభించారన్నారు. కానీ ఇప్పటివరకూ ధైన్యాన్ని కొనలేదని ఆరోపించారు. కనీసం కాటా కూడా వేయలేదని, అక్కడ ఒక్క గన్నీ బ్యాగు కూడా లేదని విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆర్భాంటంగా ఎమ్మెల్యేలు ప్రారంభించినా.. వాటి వల్ల రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. అకాల వర్షం వల్ల రైతుల తీవ్రంగా నష్టపోయారని వ్యాఖ్యానించారు. ధాన్యం తడిచిపోయి కల్లాల్లోనే ఉన్నాయన్నారు. దీంతో రైతులు అన్నమో రామచంద్రా అంటూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుననే చెప్పుకునే సీఎం కేసీఆర్.. రైతులు పండించిన ప్రతి గింజను కొనాలని పొంగులేటి డిమాండ్ చేశారు.
Read More: ఎడ్లబండిపై పొంగులేటి.. తక్షణం అంటే ఎన్నిరోజులంటూ సీఎం కేసీఆర్‌పై ఫైర్