- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సస్పెన్షన్ వేటుపై పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ ఎస్ పార్టీ నుంచి సస్పెండయిన తర్వాత మాజీ ఎంపీ పొంగులేటీ స్పందించారు. ఇన్ని రోజులకు నాకు విముక్తి కలిగిందన్నారు. దొరల గడీ నుంచి విముక్తి లభించినందకు సంతోషంగా ఉందన్నారు. పార్టీ నుంచి ఇప్పటికైనా సస్పెండ్ చేసినందుకు ధన్యవాదాలు అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరేనాటికి తాను వైసీపీ తెలంగాణ అధ్యక్షుడినన్నారు. బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు.
పాలేరు ఉపఎన్నికలో విజయం కోసం నాపై ఒత్తిడి తెచ్చారన్నారు. ఖమ్మంలో సమస్యలపై ఏనాడైనా చర్చించారా అని ప్రశ్నించారు. ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా కేటీఆర్ కోసం పార్టీలో ఉన్నానన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా, అవమానాలు ఎదురైనా భరించాను అన్నారు. తప్పు మీ దగ్గర పెట్టుకుని నాపై నిందలు వేస్తారా అని మండి పడ్డారు.అయితే నిన్న కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో కేసీఆర్ పైనా, ఆయన కుటుంబంపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినందుకు గాను మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను కాసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ప్రకటన వెలువడింది.
Also Read: కేసీఆర్ సంచలన నిర్ణయం.. పార్టీ నుంచి పొంగులేటీ శ్రీనివాసరెడ్డి, జూపల్లీ కృష్ణారావు సస్పెండ్..