పార్టీలో చేరిక ముహూర్తం రివీల్ చేసిన పొంగులేటి.. కీలక ప్రకటనపై క్లారిటీ!

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-15 09:18:58.0  )
పార్టీలో చేరిక ముహూర్తం రివీల్ చేసిన పొంగులేటి.. కీలక ప్రకటనపై క్లారిటీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాట్ టాపిక్‌గా మారారు. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఆయన తర్వాతి నిర్ణయం ఏంటనేదానిపై రోజుకో ఊహాగానం తెరపైకి వస్తోంది. ఈ క్రమంలో వనపర్తిలో మాజీ మంత్రి జూపల్లితో కలిసి పొంగులేటి నిర్వహించిన ఆత్మగౌరవ సభ చర్చనీయాశం అయింది. ఈ సభా వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఈ ఇద్దరు నేతలు టార్గెట్ చేశారు.

అయితే స్వతహాగానే బలమైన నాయకుడిగా పేరున్న పొంగులేటి ఏ పార్టీలోకి చేరబోతున్నారనే దానిపై రకరకాల ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తన రాజకీయ భవిష్యత్‌పై పొంగులేటి సోమవారం మరోసారి క్లారిటీ ఇచ్చారు. మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న షోలో పాల్గొన్న పొంగులేటి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను డబ్బుల కోసం ఏనాడు రాజకీయం చేయలేదన్నారు.

తన నెక్స్ట్‌స్టెప్‌పై అభిమానులు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొన్న మాట నిజమే అయినప్పటికీ అన్ని సమీక్షల అనంతరమే నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పారు. మరోసారి తప్పటడుగు వేయకూడదనే ఆలోచనతోనే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు. అన్ని విశ్లేషణలు చివరి దశకు వచ్చాయని జూన్ 15 నుంచి 20వ తేదీ మధ్యలో తన రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం వెల్లడిస్తానన్నారు.

జూన్ 2వ తేదీన పార్టీ అనౌన్స్ చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తమ పార్టీలో చేరాలని కాంగ్రెస్, బీజేపీల నుంచి ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని కానీ ఈ రెండు పార్టీల ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్‌ను చీల్చే రేస్‌లో ఉన్నాయన్నారు. నమ్మిన కార్యకర్తలు, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే తన నిర్ణయం ఉంటుందన్నారు. కేసీఆర్ సొల్లు మాటలతో కాలం నెట్టుకు వస్తున్నాడని ప్రతిసారి సొల్లు చెబుతూ ప్రజలను మభ్యపెట్టడం సాధ్యం కాదని అన్నారు.

Read More: ‘పేపర్ లీక్ చేస్తే పూలల్ల పెట్టి కాపాడుతుండ్రు’

రాష్ట్రంలో ఆ రెండు పార్టీల మధ్యే పోటీ : సీపీఐ నారాయణ

Advertisement

Next Story