ఎన్నికలకు సర్వం సిద్ధం - పోలింగ్ స్టేషన్లకు ఈవీఎంలు

by Prasad Jukanti |
ఎన్నికలకు సర్వం సిద్ధం - పోలింగ్ స్టేషన్లకు ఈవీఎంలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఓట్ల పండగ సందడి కొనసాగుతోంది. రేపు జరగనున్న పోలింగ్ కోసం ఎన్నికల సామాగ్రిని ఆయా జిల్లాల్లో అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఈవీఎంలు తీసుకునేందుకు పోలింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకున్నారు. పోలింగ్ బూత్ ల వారీగా, సెక్టార్ల వారీగా విభజించి సామాగ్రిని పంపిణీ కేంద్రాలో పోలింగ్ అధికారులకు అంజేస్తున్నారు. ఆయా జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పరిలీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పోలింగ్ అధికారులకు ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు. విధులను నిబద్ధతతో నిర్వహించాలని ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా పోలింగ్ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. ఇవాళ సాయంత్రం వరకు పోలింగ్ సిబ్బంది సామాగ్రితో పాటు పోలింగ్ బూత్ లకు చేరుకోనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానున్నది. 17 ఎంపీ స్థానాలు, కంటోన్మంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 35,809 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించబోతున్నారు. 106 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 6 గంటల వరకు, 13 సమస్యాత్మక సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్నది. జూన్ 4న ఓట్లను లెక్కించనున్నారు.

Advertisement

Next Story