- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Political Heat: రాష్ట్రంలో పొలిటికల్ హీట్.. పోటాపోటీగా ఆ మూడు పార్టీల యాక్షన్ ప్లాన్స్
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఇప్పట్లో ఎన్నికలు లేకున్నా మూడు ప్రధాన పార్టీల మధ్య ట్రయాంగిల్ ఫైట్ నెలకొన్నది. ఓ వైపు రాష్ట్రంలో కాంగ్రెస్ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా రేవంత్ సర్కార్ ప్రజావిజయోత్సవాలను నిర్వహిస్తుండగా.. ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్‌లు మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడానికి ప్రయత్నిస్తున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో రకమైన కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కెంది. కాంగ్రెస్ప్రభుత్వం ఏర్పడి ఈనెల 7వ తేదీ (శనివారం) నాటికి ఏడాది పూర్తి అవుతుంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల పేరిట (నవంబర్14 నుంచి డిసెంబర్ 9 వరకు) కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహిస్తుంది. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన, ఉద్యోగ అపాయింట్‌మెంట్ లెటర్లను అందిస్తూ ముందుకు సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విజయోత్సవాలు జరుగుతుండగా, వీటిని విజయవంతం చేయడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు. జిల్లాల్లో నిర్వహించే భారీ బహిరంగ సభలు, సమావేశాల విజయవంతం, ప్రజల్లోకి కాంగ్రెస్ ఏడాదిపాలన ఫలితాలను ప్రజల్లోకి తీసుకవెళ్లడానికి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ఒకరి చొప్పున పరిశీలకులను పార్టీ పరంగా నియమించారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను విజయవంతం చేయడానికి పార్టీ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి, పార్టీ శ్రేణుల్లోకి తీసుకవెళ్తున్నారు.
బీఆర్ఎస్ చార్జిషీట్లు..
మరోవైపు బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్‌పార్టీ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుంది. కాంగ్రెస్అధికారంలోకి వచ్చి 10 రోజులు గడవక ముందు నుంచే గులాబీ పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇక 100 రోజుల పాలన తర్వాత విమర్శలు మరింత పదునెక్కాయి. తాజాగా ఈనెల 7వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై చార్జిషీట్‌ను దాఖలు చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఇందులో ప్రభుత్వ వైఫల్యాన్నింటినీ ప్రజలకు వివరించనున్నారు. దీని కోసం ఎప్పటి నుంచో కసరత్తు చేస్తున్నారు. అందుకోసం ఓ షార్ట్‌ఫిల్మ్‌ను కూడా రూపొందించారు. దాన్ని కూడా ప్రదర్శించనున్నారు. సోషల్‌మీడియా ద్వారా ప్రభుత్వంపై దాడిని తీవ్రతరం చేయనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం తామేనని, బీజేపీ కాదనే విషయాన్ని చెప్పడానికి బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆ నేతలు అరెస్ట్‌లకు సైతం వెనకాడటంలేదు. ప్రజల్లో తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామనే భావన కల్పించి రాజకీయంగా తామే బలమైన ప్రత్యర్థిగా చెప్పుకోవడానికి యత్నిస్తున్నారు. అందుకు కాంగ్రెస్ ఏడాది పాలనను వినియోగించుకోవాలని చూస్తున్నారు.
7న రాష్ట్రానికి జేపీ నడ్డా..
కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి బీజేపీ ఈనెల 1వ తేదీ నుంచి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. చార్జిషీట్లు, బైక్‌ర్యాలీలు, బహిరంగ సభలను చేపడుతోంది. కార్నర్ మీటింగులు ఏర్పాటుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలపై 6 అబద్ధాలు, 66 మోసాల పేరిట ఈనెల 7న సరూర్ నగర్ స్టేడియంలో, బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఆర్గనైజ్ చేస్తోంది. దీనికి ముఖ్యఅతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ హాజరుకానున్నారు. వీరితో పాటు ఈ బహిరంగ సభలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్, బీజేపీ శాసనసభా పక్షనాయకులు మహేశ్వర్ రెడ్డి, బీజేపీ మండలి పక్షనాయకులు ఏవీయన్ రెడ్డి, బీజెపి జాతీయ కార్యవర్గసభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది సీఎంగా రేవంత్ప్రమాణస్వీకారం చేసిన రోజునే బీజేపీ బహిరంగ సభను నిర్వహిస్తుంది. రాష్ట్రంలో బీజేపీ బలపడాలని, కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయం అనే రీతిలో ప్రజల్లో అటెన్షన్ తెచ్చేందుకు మీటింగ్ నిర్వహిస్తున్నారు.