సీఎంల భేటీ పై పొలిటికల్ డైలాగ్ వార్.. కేసీఆర్, జగన్ పై ఏపీ మంత్రి సెన్సేషనల్ కామెంట్స్

by Prasad Jukanti |
సీఎంల భేటీ పై పొలిటికల్ డైలాగ్ వార్.. కేసీఆర్, జగన్ పై ఏపీ మంత్రి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో:మరి కాసేపట్లో జరగబోయే ముఖ్యమంత్రుల భేటీ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నది. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ అంశంపై పొలిటికల్ పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ భేటీ గురుశిష్యుల గూడుపుఠాణి అంటూ బీఆర్ఎస్ మద్దతు దారులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తుంటే ఏపీలో మాత్రం వైసీపీ వర్సెస్ బీజేపీ మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. తాజాగా సీఎల భేటీపై ఏపీ మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, జగన్ రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగిల్చి రాజకీయ లబ్ధి పొందాలని మాత్రమే చూశారని విమర్శించారు. విభజన సమస్యల పరిష్కారానికి కృషి చేయలేదన్నారు. ఇప్పుడు విభజన సమస్యలపై రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చర్చలు జరపడం అభినందనీయం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు అశాస్త్రీయంగా, అన్యాయంగా రాష్ట్ర విభజన చేసిందని వ్యాఖ్యలు చేశారు.

ఇక సీఎంల భేటీపై మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ రియాక్ట్ అయ్యారు. ఇవాళ్టి భేటీలో పోర్టుల్లో, టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటాలు కోరుతున్నట్టుగా వస్తున్న వార్తలు ఏపీ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు. పారదర్శకత కోసం, ప్రజలకు వస్తవాలు తెలియడానికి ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తే బాగుంటుందని సూచించారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటాని భావిస్తున్నాని ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed