- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బండి’ ఫోన్‌పై స్పెషల్ ఫోకస్.. అందులోని వివరాల రికవరీకి ప్రయత్నాలు!
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫోన్ పై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. హిందీ పేపర్ కాపీ కేసులో ఇది కీలకమని చెబుతున్నారు. అయితే ఈ ఫోన్ వెనక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయంటూ బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కేసు పేరుతో ఫోన్ ద్వారా పార్టీ కీలక విషయాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శిస్తున్నాయి. కాగా, బండి సంజయ్ మొబైల్ మిస్ అయిందంటూ పోలీసులకు ఫిర్యాదు అందడం గమనార్హం.
దిశ, తెలంగాణ బ్యూరో: టెన్త్ హిందీ పేపర్ కాపీ విషయంలో ప్రధాన సూత్రధాని అంటూ బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశాంత్ వాట్సాప్ ద్వారా సంజయ్‌కు హిందీ ప్రశ్నపత్రాన్ని పంపించారని, ఆ ఫోన్‌ను స్వాధీనం చేసుకుంటే మరిన్ని వివరాలు వెల్లడవుతాయని పోలీసు కమిషనర్ మీడియా సమావేశంలోనే వెల్లడించారు. కానీ ఆ ఫోన్ ను పోలీసులకు ఇవ్వలేదని బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు వెల్లడించారు. ఫోన్ దర్యాప్తులో కీలకమని, దాన్ని పరిశీలిస్తే ప్రశాంత్, బండి సంజయ్ మధ్య జరిగిన సంభాషణల వివరాలు లభ్యమవుతాయని పోలీసుల వాదన. అరెస్టు చేసినప్పుడు బండి సంజయ్ దగ్గర ఫోన్ ఉన్నదని, ఇవ్వాలని కోరినా ఇప్పటి వరకు ఇవ్వలేదని పోలీసులు పేర్కొంటున్నారు. ఆ ఫోన్ ఇప్పుడు వరంగల్‌లోని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో, ఇటు హైకోర్టులో రెండు పక్షాల మధ్య కీలక అంశంగా మారింది.
ఫోన్ కనిపించడం లేదని ఫిర్యాదు
బండి సంజయ్ ఫోన్ కనిపించడం లేదని బీజేపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్‌లో అరెస్టు చేసిన తర్వాత సంజయ్ ను నాలుగు వాహనాల్లో తిప్పారని, టీషర్టుకు జేబు లేకపోవడంతో ఎక్కడో పడిపోయి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసు వాహనాల్లోనే ఇది ఉండొచ్చని, వెదికినా కనిపించలేదని పేర్కొన్నారు. పోలీసులు కరీంనగర్ నుంచి హన్మకొండ కోర్టుకు సమర్పించే మధ్యలో తరచూ కార్లను మార్చినందువల్ల ఎక్కడ పడిపోయిందో తెలియదని పేర్కొన్నారు. పోలీసులకే అది దొరికి ఉండొచ్చని, దాన్ని వెతికిపెట్టాలని ఆ ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు. బండి సంజయ్ ఒక్క ఫోన్ మాత్రమే వాడుతారని, దాన్ని ఆయన మినహా ఇంకెవ్వరూ ముట్టుకోరని, అరెస్టు చేసే సమయంలో అది ఆయనతోనే ఉన్నదని వివరించారు.
మిస్టరీగా మొబైల్..
బండి సంజయ్ ఫోన్ ఎక్కడున్నదో దొరికితే దానికి అనుగుణంగా తదుపరి దర్యాప్తుపై స్పష్టత రానున్నది. స్వాధీనం చేసుకోవడంపై పోలీసులు, అది కనిపించడంలేదంటూ బీజేపీ లాయర్లు సంజయ్ ఫోన్‌పైనే దృష్టి పెట్టారు. ఆ ఫోన్‌ను ట్రేస్ చేసిన తర్వాత ఎవరి వ్యూహం ఏంటనేది ఖరారు కానున్నది. బండి సంజయ్ మినహా ఆ ఫోన్‌ను ఎవరూ వాడడంలేదని బీజేపీ లాయర్లు చెప్తుండడంతో పోలీసుల వ్యాన్ ఎక్కేటప్పుడు కనిపించిన ఫోన్ ఆ తర్వాత ఎలా మాయమైందనేది మిస్టరీగా మిగిలిపోయింది. పోలీసులు, సంజయ్ మినహా మరెవ్వరూ ఆ వాహనాల్లో లేనప్పుడు ఎవరి చేతికి చిక్కిందనేది కీలకంగా మారింది. సంజయ్ ఎలాగూ పోలీసుల అదుపులోనే ఉన్నందున ఇంకొకరికి ఇచ్చే అవకాశమే లేకుండాపోయింది. ఇప్పుడు ఆ ఫోన్ విషయం మరెవ్వరికంటే పోలీసులకే ఎక్కువగా తెలుసనే వాదన తెరపైకి వచ్చింది. ఇప్పటివరకూ వాడిన ఆ నెంబర్‌కు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అనే మెసేజ్ వస్తుండడంతో సిగ్నల్ ఆధారంగా కనిపెట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
బీజేపీ డీటెయిల్స్ సేకరించే ప్లానేనా?
బండి సంజయ్ ఫోన్‌లోని డేటా, వాట్సాప్ చాటింగ్‌ను పరిశీలిస్తే హిందీ పేపర్ కాపీ కుట్ర కోణం వెలికి వస్తుందన్నది పోలీసుల వాదన. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలపై జాతీయ నాయకత్వంతో ఎప్పటికప్పుడు చేసిన సంభాషణలు, వాట్సాప్ ద్వారా షేర్ చేసుకున్న అంశాలన్నీ ఆయన ఫోన్‌లో ఉంటాయనేది నిర్వివాదాంశం. ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకుంటే అందులో ఆ వివరాలు కూడా పోలీసుల చేతికి చిక్కుతాయి. వాటి గురించి తెలుసుకోడానికే పోలీసులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారన్న అభిప్రాయాలు బీజేపీ నుంచి వ్యక్తమవుతున్నాయి. ఆ ఫోన్ కనిపించకుండా పోయినందున వివరాలు బయటకు లీక్ అవుతాయేమోననే ఆందోళన సైతం కనబరుస్తున్నారు. పేపర్ లీక్ వివరాలను రాబట్టే సాకుతో ఆ ఫోన్‌లోని బీజేపీకి సంబంధించిన అంశాలను తీసుకోవడంపైనే పోలీసులు ఎక్కువ దృష్టి సారిస్తున్నారని, అందువల్లనే దానిపై పట్టుబడుతున్నారని బీజేపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఫోన్ ఇప్పటికే పోలీసుల చేతికి చిక్కిందని, అందులోని డేటా రికవరీ ప్రయత్నాలను మొదలుపెట్టారని పేరు వెల్లడించడానికి సిద్ధపడని బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రత్యర్థిగా బీజేపీకి సంబంధించిన వివరాలను హిందీ పేపర్ కాపీ సాకుతో ఆ ఫోన్ నుంచి రాబట్టడమే పోలీసులకు అన్నింటికంటే మెయిన్ ఇష్యూగా ఉన్నదనే అనుమానాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తులుగా వివరాలను వెల్లడించకపోయినా ఫోన్ ద్వారా వచ్చే సమాచారంతో కేసు దర్యాప్తుకు అవసరమైన కీలకమైన అంశాలు దొరుకుతాయన్నది పోలీసుల భావన. ఈ ఫోన్ ఎక్కడున్నదో కనిపెట్టడం ఇప్పుడు బీజేపీ లాయర్లకు, పోలీసులకు సవాలుగా మారింది.
విధ్వసం సృష్టిస్తే నేను బాధ్యుడిని కాదు.. పోలీసులకు రాజాసింగ్ వార్నింగ్