- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BJP సోషల్ మీడియా బృందంపై పోలీసుల స్పెషల్ ఫోకస్!
దిశ, కరీంనగర్ బ్యూరో: బీజేపీ సోషల్ మీడియాపై పోలీసులు డేగ కన్ను వేశారు. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న పోస్టుల పరంపరను గమనిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టయితే క్రిమినల్ కేసులు పెట్టే పనిలో నిమగ్నం అయినట్టు స్పష్టం అవుతోంది. తాజాగా శనివారం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కరీంనగర్‌కు చెందిన పరంధాము అనే బీజేపీ సోషల్ మీడియా కార్యకర్తను అరెస్టు చేశారు. తెలంగాణ సెక్రటేరియట్‌లో సంభవించిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన ట్వీట్‌కు పరంధాం ఇచ్చిన రిప్లై వివాదస్పదంగా ఉందని పోలీసులు చెప్తున్నారు. అలాగే హైదరాబాద్‌లోని ముస్లింల ఇళ్లు ఇతర మతస్తులకు అద్దెకు ఇవ్వడం లేదంటూ మరో ట్వీట్ చేశాడని పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. దీంతో 41 ఏసీఆర్పీసీ కింద నోటీస్ ఇచ్చి అరెస్టు చేసినట్టుగా ధ్రువీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు.
బీజేపీ సోషల్ మీడియా ఇంఛార్జి పరంధాం అరెస్టుపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మం కోసం పోరాడే వాళ్లను రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని, అక్రమ కేసులు బనాయించి అరెస్టులకు పాల్పడుతోందని మండిపడ్డారు. వెంటనే పరంధాంను విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కనీ తీసుకెళ్లి..
శనివారం సాయంత్రం కరీంనగర్‌లోని ఆదర్శనగర్ చేరుకున్న పోలీసులు పరంధాం ఇంటికి వెళ్లి త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు రావాలని కోరడంతో ఆయన వారితో పాటే వెళ్లారు. మార్గంమధ్యలో వాహనంలో ఉన్న పోలీసులు వేరే పోలీసు అధికారికి ఫోన్ చేసి పరంధాంను అదుపులోకి తీసుకున్నామని, హైదరాబాద్‌కు తరలిస్తున్నామని సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. శివరాత్రి పండగ అని కూడా చూరడకూండా పరంధాంను అదుపులోకి తీసుకోవడంపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపున పరంధాంను బయటకు తీసుకొచ్చేందుకు లీగల్ టీం కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. బీజేపీ చీఫ్ బండి సంజయ్ న్యాయవాదులతో మాట్లాడి పరంధాంకు అవసరమైన సాయం అందించి అతన్ని వెంటనే బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలని కోరినట్టు సమాచారం.
ఆ జిల్లాలోనే చీఫ్ పర్యటన...
శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించారు. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో పర్యటిస్తున్న సమయంలోనే సైబర్ పోలీసులు బీజేపీ సోషల్ మీడియా కార్యకర్తను అరెస్ట్ చేయడం గమనార్హం. జగిత్యాల జిల్లాలో శివాజీ విగ్రహాల ఆవిష్కరణ సందర్భంగా బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. ఇదే సమయంలో సైబర్ క్రైం వింగ్ కరీంనగర్‌లో ఎంట్రీ ఇచ్చి అదుపులోకి తీసుకోవడం చర్చకు దారి తీసింది. ఆదివారం ఉదయం సైబర్ క్రైం పోలీసులు పరంధాంను విడుదల చేసినట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : '10 వేల కోట్ల' ఆశలు.. వరాలు కురిపిస్తారని భారీ అంచనాలు!