- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YS షర్మిల పాదయాత్రకు పోలీసుల అనుమతి!
దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్రకు పోలీసుల అనుమతి లభించింది. షర్మిల పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతిని పోలీసులు మంజూరు చేశారు. ఫిబ్రవరి 2 నుంచి 18 వరకు పాదయాత్ర నిర్వహించుకోవాలని వరంగల్ సీపీ రంగనాథ్ పర్మిషన్ ఇచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకే పాదయాత్ర చేపట్టాలని, పార్టీలు, కులాలు, మతాలు, వ్యక్తిగతంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని ఈసందర్భంగా కండిషన్స్ పెట్టారు. అలాగే ర్యాలీల్లో ఫైర్ క్రాకర్స్ ఉపయోగించవద్దని, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల విధులకు ఆటంకం కలిగించవద్దనే షరతులతో అనుమతి ఇచ్చారు. గతేడాది నవంబర్ 28న షర్మిల అరెస్ట్ తో ప్రజాప్రస్థానం పాదయాత్రకు బ్రేక్ పడింది. ఆ తర్వాత శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందన్న కారణంతో షర్మిల పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ షరతులతో కూడిన పర్మిషన్ వచ్చినప్పటికీ పోలీసుల అనుమతి ఆలస్యం కావడంతో పాదయాత్రకు ఆటంకం ఏర్పడింది. తాజాగా పోలీసుల అనుమతి రావడంతో షర్మిల తన పాదయాత్ర కొనసాగించనున్నారు.
ఇవి కూడా చదవండి: షర్మిల 'ప్రజాప్రస్థానం' పునఃప్రారంభం..15 షరతులతో కూడిన అనుమతి