టెన్త్ పేపర్ లీక్ కేసులో ఈటల రాజేందర్‌కు నోటీసులు

by GSrikanth |   ( Updated:2023-04-06 12:56:03.0  )
టెన్త్ పేపర్ లీక్ కేసులో ఈటల రాజేందర్‌కు నోటీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పదో తరగతి ప్రశ్నపత్రాల కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పోలీసులు నోటీసు జారీచేశారు. గురువారం శామీర్‌పేటలోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు నోటీసులు అందజేశారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణ నిమిత్తం వరంగల్ డీసీపీ కార్యాలయానికి రావాలంటూ 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రశాంత్ అనే వ్యక్తి తన మొబైల్ నుంచి ఈటల రాజేందర్‌కు ఆయన పీఏకు వాట్సాప్ ద్వారా హిందీ ప్రశ్నపత్రాన్ని పంపించారని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఈటలకు నోటీసులు ఇచ్చిన పోలీసులు ఆయన స్టేట్ మెంట్ రికార్డు చేయనున్నారు.

Advertisement

Next Story