- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ అల్లరి మూకల్లా పోలీసుల దాడులు : Revanth Reddy
దిశ, వెబ్ డెస్క్: ప్రజల హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ స్థాపిస్తున్నానంటున్న కేసీఆర్ తమ హక్కులను హరిస్తున్నారని మండి పడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వార్ రూంపై పోలీసుల దాడులను ఖండిస్తూ ఇవాళ 12:30 కు ఢిల్లీలోని బీఆర్ఎస్ భవనాన్ని ముట్టడిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మానేతలు, కార్యకర్తలను ఫిర్యాదు కాపీ, ఎప్ఐఆర్ కాపీ చూపకుండా అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. మీరు పోలీసులా దొంగలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వార్ రూమ్లో డాటాను పోలీసులు ధ్వంసం చేశారన్నారు. మండల కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేసీఆర్ దిష్టిబొమ్మ దహనానికి పిలుపునిచ్చామని తెలిపారు. ఇనార్బిట్ మాల్ వద్ద గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడులు చేసిన పోలీసులు బీఆర్ఎస్ అల్లరి మూకల్లా వ్యవహరించారని మండి పడ్డారు. అందిన ఫిర్యాదు ఏంటి, నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ సెర్చ్ వారెంట్ చూపకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు తాను ఫోన్ చేస్తే స్పందించడం లేదని ఆరోపించారు. ఇది ఆటవికం, అనాగరికం అన్నారు.
Also Read....