- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'కేసీఆర్‌కు తొత్తులుగా పోలీసులు'
దిశ, భైంసా : పోలీసులు కేసీఆర్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అందుకే పర్మిషన్ ఇవ్వడం లేదన్నారు. తాము శాంతియుతంగా సభలు, ర్యాలీలు నిర్వహించుకుంటామంటే తెలంగాణ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పడకంటి రమాదేవి ఆరోపించారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని తన నివాసంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. బహిరంగ సభతో పాటు, ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతులు కోరామని అయినా పోలీసులు నిరాకరించారన్నారు. ఎన్నిమార్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తిప్పుకున్నారే తప్ప అనుమతులు ఇవ్వలేదన్నారు. తీరా ఆదివారం సాయంత్రం 6 గంటలకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా అనుమతి నిరాకరించినట్లు వెల్లడించారు. గత నాలుగు విడతలుగా యాత్ర కొనసాగిస్తున్నామని 5వ విడత యాత్రకు అడ్డంకులు సృష్టించడం ఏంటని ప్రశ్నించారు. ఏది ఏమైనా సభ నిర్వహించే తీరుతామన్నారు. మధ్యలో పోలీసులు వచ్చి రమాదేవిని బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వాహనంలో ఎక్కించారు.