హైదరాబాద్‌లో ఉగ్రవాద కదలికలు.. స్పెషల్ అపరేషన్‌లో ఐదుగురు అరెస్ట్

by Satheesh |   ( Updated:2023-05-09 13:44:52.0  )
హైదరాబాద్‌లో ఉగ్రవాద కదలికలు.. స్పెషల్ అపరేషన్‌లో ఐదుగురు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ఉగ్ర కదలికలపై విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారంతో స్పెషల్ అపరేషన్ చేపట్టిన తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, మధ్యప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు మంగళవారం హైదరాబాద్‌లో ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. పాతబస్తీలో డెంటిస్ట్‌గా పని చేస్తోన్న షేక్ జునైద్, మెడికల్ కాలేజ్ హెచ్వోడీ మహ్మద్ సలీం, ఇంజనీర్ అబ్దుల్ రెహ్మన్, రోజువారి కూలీ అమీద్‌లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక, పరారీలో ఉన్న కీలక నిందితుడు సల్మాన్ కోసం మధ్యప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. కాగా, వీరందరికి ఉగ్రవాద సంస్థ హిజాబ్ ఉత్ తహ్రీల్ సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుండి ఎయిర్ పిస్టళ్లు, కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story