- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral Video : బురఖా ధరించి బైక్‌పై ప్రమాదకర స్టంట్స్.. ఐదుగురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
దిశ, డైనమిక్ బ్యూరో: ఓ యువకుడు బురఖా ధరించి రోడ్లపైకి వచ్చి ప్రమాదకర స్టంట్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజీక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వీడియోలో ఉన్న ప్రకారం బురఖా ధరించిన యువకుడు బైక్ పై తన ఇష్టం వచ్చినట్లు ఇతరులకు ఇబ్బంది కలిగించేలా బైక్ నడిపాడు. అతడి బైక్‌పై మరోవ్యక్తి ఉన్నాడు. మరోవైపు అతని వెంట కొంత మంది బైక్‌లు, స్కూటీలతో ఫాలో అవుతున్నారు.
వీరు కనిపించిన యువతులను భయభ్రాంతులకు గురిచేస్తూ.. రోడ్లపై, వీధుల్లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నట్లు వీడియోలో కన్పిస్తోంది. దీంతో నెటిజన్లు ఎక్స్ వేదికగా హైదరాబాద్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. స్పందించిన పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని ఐఎస్ సదన్ ప్రాంతంలో ఆగస్టు 15న బైక్‌పై స్టంట్స్ చేస్తూ ఇద్దరు వ్యక్తులు హైమద్ దానిష్, అబ్దుల్ వాసిఫ్‌లుగా సీసీటీవీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. బురఖా ధరించిన వ్యక్తి హైమద్‌గా పోలీసులు గుర్తించారు. ఈ వీడియో తీస్తూ ఇద్దరికి సహకరించిన మరో ముగ్గురి కూడా ఐఎస్ సదన్ అదుపులోకి తీసుకున్నారు.