- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ, తమిళి సై
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ ఇవాళ తన 69వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గులాబీ బాస్‌కు సినీ, రాజకీయ ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ట్టిట్టర్ వేదికగా సీఎం కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ''తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను'' అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ సైతం కేసీఆర్‌కు ట్విట్టర్ వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు. ''గౌరవనీయులైన తెలంగాణ సీఎం కే.చంద్రశేఖర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు'' అని ట్వీట్ చేశారు. జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ కూడా కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
''భారతీయ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయాపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజా జీవితంలో తనదైన పంథాను కలిగిన కేసీఆర్ గారికి సంతోషకరమైన జీవితం, ఆరోగ్య కరమైన దీర్ఘాయుష్షును ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని ట్విట్టర్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక, సీఎం కేసీఆర్ బర్త్ డేను బీఆర్ఎస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. పాలభిషేకాలు, పలు సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టి పెద్ద ఎత్తున కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నారు.