తెలంగాణ BJP ఆఫీసు సిబ్బందిని పలకరించిన ప్రధాని

by GSrikanth |
తెలంగాణ BJP ఆఫీసు సిబ్బందిని పలకరించిన ప్రధాని
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని ప్రధానమంత్రి మోడీ ఆప్యాయంగా పలకరించారు. బండి సంజయ్ చొరవతో బీజేపీ స్టేట్ ఆఫీస్ సిబ్బందికి ప్రధానిని కలిసే అవకాశం లభించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీస్‌లో పనిచేసే స్వీపర్, ఆఫీస్ బాయ్, డ్రైవర్ ఇతర సిబ్బందిని సికింద్రాబాద్ స్టేషన్‌కు తరలించారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న మోడీ వందేభారత్ రైలు ప్రారంభోత్సవానికి ప్లాట్ ఫాం 10 వద్దకు రాగానే కార్యాలయ సిబ్బందిని పరిచయం చేశారు. ఎప్పటి నుంచి బీజేపీ ఆఫీసులో పనిచేస్తున్నారని, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని మోడీ అడిగి తెలుసుకున్నారు. ప్రధానిని కలవడంపై కార్యాలయ సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed