NDAలోకి కేసీఆర్‌ని చేర్చుకోవడంపై ప్రధాని మోడీ క్లారిటీ

by Sathputhe Rajesh |   ( Updated:2024-05-03 05:50:56.0  )
NDAలోకి కేసీఆర్‌ని చేర్చుకోవడంపై ప్రధాని మోడీ క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇటీవల ఖమ్మంలో నామా నాగేశ్వర్ రావు గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారన్న వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలతో పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ బీజేపీతో కలుస్తారా.. లేక హస్తం పార్టీతో ముందుకెళ్తారా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. ఎన్డీఏలో కేసీఆర్‌ను చేర్చుకోవడంపై కుండ బద్ధలు కొట్టారు. ఒక సారి కలుసుందాం రా అంటేనే కేసీఆర్ ను తిరస్కరించి పంపామని.. మళ్లీ తమ దగ్గరికి వచ్చినా అదే ఆన్సర్ అని మోడీ తేల్చిచెప్పారు. కేసీఆర్ ను ఎన్డీఏలోకి రానిచ్చే ప్రసక్తే లేదన్నారు. ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తాయని ఇప్పటికిప్పుడు కూటమికి 360 సీట్లు ఉన్నాయన్నారు. ఎన్డీఏలో లేకున్నా బీజేడీతో కలుపుకుని తమ వద్ద 400 సీట్లు ఉన్నాయన్నారు. అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్‌ను ఇండియా కూటమిలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో జాతీయ నేతగా ఎస్టాబ్లిష్ అవుదామనుకున్న కేసీఆర్ భవితవ్యం ఏంటనేది పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story