తెలంగాణ ప్రభుత్వ స్కూల్లో పందులు.. ఇదేనా డెవలప్మెంట్ అంటూ నెటిజన్ల ఫైర్

by sudharani |   ( Updated:2023-09-17 15:50:19.0  )
తెలంగాణ ప్రభుత్వ స్కూల్లో పందులు.. ఇదేనా డెవలప్మెంట్ అంటూ నెటిజన్ల ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ప్రభుత్వ స్కూల్ దుస్థితి ఇదని సోషల్ మీడియాలో తాజాగా ఒక వీడియో వైరల్‌గా మారింది. నారాయణపేట నియోజకవర్గం మరికల్ గ్రామం లోని ప్రభుత్వ పాఠశాలలో పందులు తిరుగుతున్నాయి. స్కూల్లో విద్యార్థులు భోజనం చేసిన తర్వాత ప్లేట్స్ కడుగుతున్న సమయంలో స్కూల్ ఆవరణలోనే మురికి నీళ్ళ తో నిండి ఉంది. ఆ నీళ్లలోనే పందులు తిరుగుతున్నాయి. ఇది గమనించిన పలువురు వీడియో తీసి నెట్టింట పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు ఇదేనా తెలంగాణ డవలప్‌మెంట్ అంటూ మంత్రులను ట్యాగ్ చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమని మంత్రి కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వానికి ట్విట్టర్ లో ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed