Wow.. ఇంద్రభవనంలా తెలంగాణ సచివాలయం (ఫొటోస్)

by GSrikanth |
Wow.. ఇంద్రభవనంలా తెలంగాణ సచివాలయం (ఫొటోస్)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయాన్ని ఈనెల 30న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే భవన నిర్మాణం దాదాపు పూర్తి కాగా, బీఆర్‌కేఆర్ భవనం నుంచి ఇవాళ్టి(ఏప్రిల్ 24) నుంచి షిఫ్టింగ్‌ కూడా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సచివాలయం లోపలి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంద్రభవనాన్ని తలపిస్తోన్న సచివాలయం చూపరులను కట్టిపడేస్తోంది. సరికొత్త కాంతులతో ఆకట్టుకుంటోంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయం భవనం.. మొత్తం 28 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 8 ఎకరాలను పూర్తిగా పచ్చదనం కోసమే కేటాయించారు. అద్భుతమైన పార్కును అభివృద్ధి చేశారు. దానికి సంబంధించిన ఫొటోలు, లోపలి దృశ్యాల్ని మనం ఇప్పుడు చూస్తున్నాం.



















Advertisement

Next Story

Most Viewed