BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు బిగ్ షాక్.. ముగ్గురి బెయిల్ పిటిషన్లు కొట్టివేత

by Satheesh |   ( Updated:2024-07-12 12:10:20.0  )
BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు బిగ్ షాక్.. ముగ్గురి బెయిల్ పిటిషన్లు కొట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పాలిటిక్స్‌ను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోని ముగ్గురు ప్రధాన నిందితులు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్లను న్యాయస్థానం తోసిపుచ్చింది. కాగా, అరెస్ట్ చేసి వంద రోజులు దాటిందని.. పోలీసులు ఇప్పటికీ ఛార్జ్‌షీట్ దాఖలు చేయలేదని.. దీనిని పరిగణలోకి తీసుకుని డీఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని నిందితుల తరుఫు లాయర్ వాదించగా.. కేసు విచారణ కీలక దశలో ఉందని.. ఈ సమయంలో నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. పోలీసుల వాదలనతో ఏకీభవించిన న్యాయస్థానం.. ముగ్గురు నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టేసింది. దీంతో నిందితులు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులకు మరోసారి నిరాశే ఎదురైంది. జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం వీరు జైలులో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed