Phone Tapping Case: కేటీఆర్‌పై బల్మూరి వెంకట్ సంచలన ఆరోపణలు.. సొంత పార్టీ నేతలను వదిలిపెట్టలేదని వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-04-05 09:42:09.0  )
Phone Tapping Case: కేటీఆర్‌పై బల్మూరి వెంకట్ సంచలన ఆరోపణలు.. సొంత పార్టీ నేతలను వదిలిపెట్టలేదని వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే, ఈ కేసు విషయంలో మాత్రం అటు అధికార.. ఇటు ప్రధాన ప్రతిపక్షాల నడుమ మాటలు యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే మాజీమంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సంచలన ఆరోణలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేటీఆర్‌కు తెలిసే సీని ప్రముఖులు, కాంగ్రెస్ నేతలు, పలువురు అధికారల ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయని తెలిపారు. చివరికి సొంత పార్టీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేసి బ్లాక్ మెయిల్ చేశారని ఆయన ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎంత పెద్దవాళ్లు ఉన్నా.. వారికి శిక్ష తప్పదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హెచ్చరించారు.

Advertisement

Next Story