గణేశ్ మండపం వద్ద విషాదం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

by karthikeya |
గణేశ్ మండపం వద్ద విషాదం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
X

దిశ, మెదక్ ప్రతినిధి: గణేశ్ మండపం సమీపంలో అపశృతి నెలకొంది. మండపం వద్ద శుభ్రం చేసేందుకు వెళ్లిన గ్రామ పంచాయతీ కార్మికుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందిన ఘటన హవేలీ ఘనపూర్ మండలం రాజ్ పేటలో సోమవారం తెల్లవారు జామున జరిగింది. స్థానికుల కథనం మేరకు.. రాజ్ పేటకు చెందిన దాసరి పోచయ్య(60) గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే సోమవారం ఉదయం గ్రామంలో శుభ్రం చేస్తూ స్థానికంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్దకు వచ్చి శుభ్రం చేస్తున్నాడు. అక్కడ ఏర్పాటు చేసిన జేవైర్‌ను పక్కన పెట్టేందుకు పట్టుకోగా విద్యుత్ షాక్ తగిలి అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. విషయం తెలియడంతో గణేష్ నిర్వాహకులు, గ్రామస్థులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా అప్పటికే పోచయ్య మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed