టీఎస్ ఐపాస్ ద్వారా వినూత్న పరిశ్రమలకు పర్మిషన్స్ : KTR

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-15 09:15:04.0  )
టీఎస్ ఐపాస్ ద్వారా వినూత్న పరిశ్రమలకు పర్మిషన్స్ : KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణను తమ తయారీ కేంద్రంగా ఎంచుకున్న ఫాక్స్ కాన్ చైర్మన్ సీడ్నీ లు మరియు కంపనీ ప్రతినిధి బృందానికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఫాక్స్ కాన్ సంస్థ శంకుస్థాపనలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. కంపెనీ నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. రానున్న తొమ్మిది నెలల్లోనే ఈ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించుకోవాలన్న లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సహకరిస్తుందని తెలిపారు. ఈ రోజు ఈ కంపెనీ శంకుస్థాపన తెలంగాణా చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

కంపెనీతో ప్రారంభమైన ఈ భాగస్వామ్యం భవిష్యత్తులో మరింతగా విస్తరిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. కంపెనీ తమ తయారీ ప్లాంట్లను భవిష్యత్తులోనూ విస్తరించేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తనదైన వినూత్నమైన పరిశ్రమల అనుమతుల ప్రక్రియ టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటికే దేశంలో ప్రశంసలు పొందుతుందన్నారు. గత తొమ్మిది సంవత్సరాలు తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. దేశంలోనే ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని తెలిపారు.

తెలంగాణ ఫర్ క్యాపిట 2.5 రెట్లు పెరిగిందిదాదాపు 22, 700 పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించామన్నారు. 50 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 23 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. ప్రభుత్వాలు అనుకుంటే 20 సంవత్సరాల్లోనే చైనా సాధించిన ప్రగతిని సాధించేందుకు అవకాశం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా పనిచేస్తే 2040 నాటికి తలసరి ఆదాయాన్ని ఆరు రెట్లు పెంచి 20వేల డాలర్లకు చేర్చాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. దేశంలో గత సంవత్సరం వచ్చిన టెక్నాలజీ ఉద్యోగాల్లో మూడింటిలో ఒకటి తెలంగాణలోనే వచ్చిందన్నారు.

దేశంలో గత ఏడాది వచ్చిన టెక్నాలజీ ఉద్యోగాలు 33% తెలంగాణ నుంచి ఉండడం గర్వకారణమని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ రంగాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత రంగంగా గుర్తించిందన్నారు. చైనా మాదిరి ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఫాక్స్ కాన్ చైర్మన్ తెలంగాణ వేగంపైన ఉంచిన నమ్మకానికి అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం మా పైన ఉన్నదని.. ఆ దిశగా పనిచేస్తామని భరోసా ఇచ్చారు. కంపెనీ తెలంగాణకి రావడంలో కీలక పాత్ర వహించిన తెలంగాణ ప్రభుత్వ అధికారుల బృందానికి మనస్పూర్తిగా అభినందనలు తెలుపుతున్నానన్నారు.

500 మిలియన్ డాలర్లను తెలంగాణలో ఇన్వెస్ట్ చేస్తున్నందుకు ఫాక్స్ కాన్ కంపెనీకి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఫాక్స్ కాన్ కంపెనీ అనుభవాలకు work experience కి మించి అద్భుతమైన ప్రస్థానం ఇక్కడ కొనసాగుతుందన్న నమ్మకం ఉన్నదన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి నాయకత్వం వహించేలా.. మార్గదర్శకంగా ఉండేలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నదన్నారు. రానున్న 10 సంవత్సరాలలో 15 లక్షల ఉద్యోగ అవకాశాలను ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన టెక్నాలజీ రంగంలో ఇక్కడి యువతకు శిక్షణ ఇచ్చేలా foxcon ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఫాక్స్ కాన్ సంస్థ చైర్మన్ అండ్ సీఈవో సిడ్నీ లూ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా తమ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈరోజు శంకుస్థాపన చేసుకుంటున్నామన్నారు. తెలంగాణలో ఉన్న విస్తరమైన అవకాశాలను కంపెనీ ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తుందన్నారు. తమ కంపెనీకి సహకారం అందించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కంపెనీ శంకుస్థాపన ద్వారా తెలంగాణ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యాప్‌లో సుస్థిరమైన స్థానం సంపాదించుకునేందుకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, Foxconn interconnect technology చైర్మన్ అండ్ సీఈవో సిడ్నీ లూ, ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Read More: కేసీఆర్ సర్కార్ కంటే తాలిబన్ల సర్కార్ నయం.. ప్రభుత్వ తీరు దుర్మార్గం: ఆకునూరి మురళి

Advertisement

Next Story

Most Viewed